తెలంగాణలో మద్యం అమ్మకాలపై ఏపీ లిక్కర్ ఎఫెక్ట్ గట్టిగానే పడుతోంది. ముఖ్యంగా ఏపీ సరిహద్దు జిల్లాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆరు నెలల కింది వరకు తెలంగాణ నుంచి మద్యం ఏపీకి తరలివెళ్తుంటే.. ఇప్పుడు ఏపీ మద్యం తెలంగాణకు వస్తోంది. దానికి ముఖ్య కారణం.. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లిక్కర్ పాలసీ. దీంతో.. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఏపీ మద్యంవైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో.. తెలంగాణ మద్యం దుకాణాల్లో మద్యం అమ్మకాలు భారీగా పడిపోతున్నట్టు అధికారులు చెప్తున్నారు.