గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు ఛార్జ్‌షీట్‌ను విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ఈ ఛార్జ్‌షీట్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును పలుమార్లు ప్రస్తావించారు, అయితే ఆయనను నిందితుడిగా చేర్చలేదు. సిట్ ఇప్పటివరకు 40 మంది వ్యక్తులు, సంస్థలను నిందితులుగా చేర్చగా, తాజాగా మరో 8 మందిని చేర్చారు. జగన్ పాత్రపై పూర్తి విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.