AP Liquor Scam Famous Firms In Chargesheet: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్‌లో తిలక్ నగర్ ఇండస్ట్రీస్, అంబర్ స్పిరిట్స్ వంటి పలు కంపెనీలు అక్రమాలకు పాల్పడ్డాయని సిట్ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ కంపెనీలు లంచాలు ఇచ్చి, అక్రమంగా లాభాలు పొందాయని ఆరోపణలు ఉన్నాయి. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఒక్కటే రూ. 218 కోట్ల లంచం ఇచ్చిందని, నగల వ్యాపారుల ద్వారా డబ్బు మార్పిడి చేసిందని సిట్ గుర్తించింది. ఈ ఆరోపణలను తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఖండించింది.