Andhra Pradesh L And T Flood Donation: ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు పలువురు ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్కుల్ని అందజేస్తున్నారు. తాజాగా ఎల్ అండ్ టీ భారీ విరాళాన్ని అందజేసింది. అలాగే రామ్‌కోతో పాటుగా మరికొందరు విరాళాలను అందజేశారు. వరద బాధితులకు దాతల నుంచి మొత్తం రూ.400 కోట్లకుపైగా విరాళాలు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇంకా విరాళాలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు .