ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థుల యూనిఫామ్‌లను మార్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్ పేరుతో స్కూలు బ్యాగులు, పుస్తకాలు, యూనిఫామ్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి స్కూలు విద్యార్థుల యూనిఫామ్‌లను ప్రభుత్వం మార్చింది. ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కొత్త యూనిఫామ్‌లు అందించనుంది. ఈ డిజైన్లకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు.