ఏపీ విద్యార్థులకు సర్కార్ తీపి కబురు.. త్వరలో డైట్ ఛార్జీల పెంపు

1 month ago 13
రాష్ట్రంలోని ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల్లో చదువుతున్న 6.52 లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలను పెంచాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. మార్కెట్ ధరలకు అనుగుణంగా 10 శాతం, 15 శాతం పెంపుదలకు సంబంధించిన రెండు రకాల ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. 10 శాతం పెంచితే ఏడాదికి రూ.99 కోట్లు, 15 శాతం పెంచితే రూ.148 కోట్ల అదనపు భారం పడనుంది. దీనిపై వారం, పది రోజుల్లో తుది నిర్ణయం రానుండగా... జూన్ లేదా జులై నుంచి అమల్లోకి రానుంది. కాస్మెటిక్ ఛార్జీలలో మాత్రం ఎలాంటి మార్పులు ప్రతిపాదించలేదు.
Read Entire Article