తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయి హుండీ ఆదాయం.. ఇవాళ ఒక్కరోజే రూ.6.93 కోట్లు

1 hour ago 1
తిరుమల శ్రీవారి హుండీకి భక్తుల కానుకల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా ఒక్కరోజులోనే రూ.6.93 కోట్ల హుండీ ఆదాయం నమోదైనట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమల చరిత్రలో రోజువారీ హుండీ ఆదాయం రూ.6 కోట్ల మార్కును దాటడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఇప్పటివరకు అత్యధికంగా 2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా రూ.7.68 కోట్ల ఆదాయం నమోదైంది. తిరుమలకు భక్తుల రద్దీ పెరగడంతో హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది.
Read Entire Article