ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీఓ-117ను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో తొమ్మిది రకాల పాఠశాలలు అందుబాటులోకి రానున్నాయి. అంగన్‌వాడీలను శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలుగా మారుస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. మరి ఈ 9 రకాల బడులు ఏవి.. వాటిల్లో ఎంత మంది విద్యార్థులు ఉండనున్నారు వంటి వివరాలు మీకోసం..