AP Secretariat Venkatramireddy Arrested: ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ నేత వెంకట్రామిరెడ్డి అరెస్ట్ అయ్యారు. అనుమతి లేకుండా మందు పార్టీ ఏర్పాటు చేసినందుకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. త్వరలో సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్ డైరెక్టర్ పదవుల కోసం ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ డైరెక్టర్ పదవుల్లో తమ వాళ్లను గెలిపించుకోవాలనే ఉద్దేశంలో వెంకట్రామిరెడ్డి ఉద్యోగులకు ప్రలోభ పెట్టారనే కారణంతో అరెస్ట్ చేశారని అంటున్నారు.