వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్, టీడీపీ నాయకులు పదవుల కోసం తెలంగాణను విస్మరించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో తెలంగాణ పదాన్నే నిషేధించారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీనే విలన్ చేసిందని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ఆయన పేర్కొన్నారు.