ఏపీ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించడం జరిగింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహించేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 10 నగర పంచాయతీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలకు అక్టోబర్ 28న ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఇప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.