YS Jagan Passport AP High Court Verdict: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కింది. ఆయన సాధారణ పాస్‌పోర్టును ఐదేళ్ల పాటు రెన్యువల్ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్ట్ విధించిన పాస్‌పోర్ట్ కాలపరిమితిని ఒక ఏడాది నుంచి 5 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు హైకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో లండన్ ప్రయాణానికి లైన్ క్లియర్ అయ్యింది.