APSRTC To Accept Rs 10 Coins: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల నుంచి రూ.10 నాణేలను స్వీకరించాల్సిందేనని యాజమాన్యం ఆదేశించింది. ఈ మధ్య కాలంలో రూ.10నాణేలను చెలామణి కావడం లేదంటూ కొందరు కండక్టర్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని ప్రయాణికుల నుంచి ఆర్టీసీ యాజమాన్యానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆపరేషన్ ఈడీ ఆదేశాలు జారీచేశారు. .ఆయా డిపోల మేనేజర్లు తమ పరిధిలోని డ్రైవర్లు, కండక్టర్లకు బుధవారం ఆదేశాలిచ్చారు. రూ.10 నాణేలను స్వీకరించాలని సూచించారు.