ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు.. ఎంతంటే?

2 months ago 4
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేల అభివృద్ధికి కేంద్రం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బడ్జెట్‌లో ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల కోసం రూ. 9,417 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ప్రస్తుతం ఏపీలో రూ.84,559 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయన్న మంత్రి.. 73 స్టేషన్ల రూపురేఖలు మార్చేలా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. యూపీఐ హయాంతో పోలిస్తే ఎన్డీఏ హయాంలో ఏపీకి రైల్వే కేటాయింపులు 11 రెట్లు పెరిగాయని వివరించారు.
Read Entire Article