ఏపీకి కేంద్రం శుభవార్త వినిపించింది. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసింది. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్‌వెస్ట్‌మెంట్ కింద తొలి విడతగా రూ.113.75 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇందులో 75 శాతాన్ని ఖర్చు చేస్తే.. మిగతా మొత్తాన్ని రెండో విడతలో విడుదల చేస్తారని తెలిపారు. సాస్కి నిధులతో గండికోట, అఖండ గోదావరి పనులు చేపట్టనున్నట్లు కందుల దుర్గేష్ వెల్లడించారు.