Neradi Barrage Gets Clearance After Two Decades: కేంద్రం నుంచి ఏపీకి భారీ ఊరట దక్కింది. ఆంధ్రా, ఒడిశా మధ్య ఎన్నో ఏళ్లుగా వివాదంగా మారిన నేరడి బ్యారేజీ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. భామిని మండలం నేరడిలో వంశధార నదిపై ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం గెజిట్ ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశా-ఆంధ్ర మధ్య కొనసాగుతున్న సమస్య కొలిక్కిరానుంది.