ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం త్వరలోనే మరో భారీ శుభవార్త వినిపించనున్నట్లు తెలిసింది. సౌదీ అరేబియాతో కలిసి రెండు ఆయిల్ రిఫైనరీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేంద్రం.. అందులో ఒకదానిని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సౌదీ ఆరామ్‌కో సంస్థ, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్ భాగస్వామ్యంతో ఆయిల్ రిఫైనరీల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు చేశారు. అందులో ఒకటి గుజరాత్‌లో, మరొక రిఫైనరీ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే రిఫైనరీ భూసేకరణ కోసం రత్నగిరి జిల్లాలో వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండటంతో ఈ ప్రాజెక్టును ఏపీకి తరలించాలని భావిస్తున్నట్లు సమాచారం.