Banglore Corridor Link With Tirupati And Naidu Peta: ఏపీ మీదుగా మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్లు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బెంగళూరు చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్‌ను తిరుపతి, నాయుడుపేట మీదుగా వెళ్లేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ఈ కనెక్టవిటీతో అమరావతికి రెండో హైస్పీడ్ కారిడార్ లింక్ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్వెస్ట్ మేరకు కేంద్రం ఈ ఎలైన్‌మెంట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.