ఆంధ్రప్రదేశ్‌కు టెక్స్‌టైల్ రంగంలో కొత్త పెట్టుబడులు రానున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో.. పలు కంపెనీలు రూ. 4290 కోట్ల పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ సంస్థలు ఐదు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. ఈ పరిశ్రమల వల్ల 6,460 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు.