కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో ఏపీకి గుడ్ న్యూస్ వినిపించింది. ఏపీతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాలలో రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. రేర్ ఎర్త్ కారిడార్ ప్రాజెక్టు ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏపీలోని కోస్టల్ కారిడార్ వెంట ఉన్న ఖనిజాలు, తీర ప్రాంతం, పోర్టులతో అనుసంధానం.. ఏపీని అరుదైన ఖనిజాల అన్వేషణకు గమ్యస్థానంగా మార్చుతుందంటున్నారు.