AP Brothers In Suicide Varanasi: ఏలూరు జిల్లాకు చెందిన అన్నదమ్ములు వారణాసిలో ప్రాణాలు తీసుకున్నారు. వారిని పెరుమాళ్ల లక్ష్మీనారాయణ , పెరుమాళ్ళ లోక్ వినోద్‌లుగా గుర్తించారు. భేల్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోనాపూర్‌లోని మానస సరోవర్ ప్రాంతంలోని రామ్‌తారక్ ఆశ్రమంలో వీరిద్దరి మృతదేహాలు కుళ్లిపోయి స్థితిలో గుర్తించారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వీరిద్దరూ తీర్ధయాత్రలకు వచ్చామని చెప్పి ఆగస్టు 28న రూమ్ తీసుకున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. తాము నలుగురు వ్యక్తుల వల్ల మానసికంగా ఆందోళన చెందుతున్నామని సెల్పీ వీడియోను రికార్డ్ చేశారు.