Hyderabad Real Estate: ఏపీలో చంద్రబాబు వస్తే.. తెలంగాణలోని హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ నుంచి రియల్ ఎస్టేట్ రంగమంతా అమరావతికి వెళ్తుందని జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి కొట్టిపారేశారు. అమరావతిలో వచ్చి వరదల కారణంగా.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు భయపడుతున్నారని తెలుస్తోంది. అమరావతి కంటే.. హైదరాబాద్, బెంగళూరు వైపే మొగ్గు చూపుతున్నారు.