Ap Weather Today: ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. ప్రస్తుత ఐఎండి సమాచారం ప్రకారం అక్టోబరు 22,మంగళవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత అది వాయువ్య దిశగా కదిలి అక్టోబర్ 24 (గురువారం) నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఎటు వెళ్తుంది అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రభావంతో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.