Andhra Pradesh Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. పశ్చిమవాయువ్య దిశగా ఉత్తరాంధ్ర,దక్షిణఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణం అంచనా వేస్తోంది. కోస్తా తీరంవెంబడి గంటకు45-65కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు అన్నారు. కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో శని, ఆది వారాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.