Andhra Pradesh Mother Dairy Investment Rs 200 Crore: ఏపీకి మరో పెట్టుబడి రాబోతోంది. మదర్ డెయిరీ సంస్థ పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ ప్లాంటుపై పెట్టుబడులు పెట్టనుంది. ప్రభుత్వం భూములు కేటాయిస్తే ప్లాంటు నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇది పూర్తి చేయడానికి రెండేళ్లు సమయం పట్టనుంది. కుప్పంలో రూ.150 - 200 కోట్లతో ఏర్పాటు చేయనుండగా.. దీనివల్ల 5 వేలకు పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుప్పం స్థానిక రైతులకు కూడా ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు.