ఏపీలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు దిశగా కీలక అడుగుపడింది. ఏపీలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్రీ ప్రాజెక్టు యాక్టివిటీస్ చేపట్టేందుకు బీపీసీఎల్ బోర్డు ఆమోదం తెలిపింది. ఏపీలోని తూర్పు కోస్తా తీర ప్రాంతంలో బీపీసీఎల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు ఇందులో పేర్కొన్నారు. బోర్డు ఆమోదం లభించిన విషయాన్ని బోర్డు సెక్రటరీ నిఫ్టీకి తెలియజేశారు. మరోవైపు బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు కోసం మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట వంటి ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.