విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. బుధవారం కేంద్ర మంత్రిని కలిసిన వైజాగ్ ఎంపీ.. విశాఖపట్నం తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే విశాఖపట్నం బెంగళూరు మధ్య ప్రతి రోజూ రైలు నడపాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు దువ్వాడ రైల్వే స్టేషన్‌లోనూ స్టాపింగ్ ఇవ్వాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు దిశగా చర్యలు వేగవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.