ఆంధ్రప్రదేశ్‌లోని రైలు ప్రయాణికులకు త్వరలోనే మరో గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రం మీదుగా ఇప్పటికే పలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే త్వరలోనే మరో వందేభారత్ రైలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. చెన్నై విజయవాడ వందేభారత్ రైలును నరసాపురం వరకూ పొడిగించినందుకు ధన్యవాదాలు తెలిపిన రఘురామ.. హైదరాబాద్ నుంచి నరసాపురం వరకూ మరో వందేభారత్ రైలు నడిచేలా కృషి చేస్తామన్నారు.