AP To Get Rs 3310 Crores From Union Govt: ఏపీ ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రాబట్టే పనిలో ఉంది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ పనుల్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పనుల్ని మార్చి 31లోపు పూర్తి చేస్తే.. కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తాయి. మొత్తం రూ.3,310 కోట్ల నిధుల్ని కేంద్రం నుంచి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నారు.