Amaravati Second Lulu Mall: ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే పనిలో ఉంది ప్రభుత్వం.. ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. అయితే తాజాగా లులు గ్రూప్ కూడా ఏపీలోకి ఎంట్రీ ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లులు మాల్స్, కన్వెన్షన్ సెంటర్స్‌తో పాటుగా మల్టీప్లెక్స్‌లను ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే విశాఖపట్నంలో మాల్ ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతున్నాయి.. ప్రభుత్వం భూమి కేటాయించబోతోంది. అయితే తాజాగా అమరావతిలో కూడా లులు గ్రూప్ పెట్టుబడులు పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది.. ఈ మేరకు స్థలం కోసం చూస్తున్నారు.