Lalitha Jewellers donates one crore to Andhra Pradesh: ఏపీలో వరద బాధితుల సహాయం కోసం లలితా జ్యువెలర్స్ కోటి రూపాయలు విరాళం ప్రకటించింది. ఈ మేరకు లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్.. సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి విరాళం అందించారు. విరాళం తాలూకూ చెక్‌ను ముఖ్యమంత్రి చేతికి అందించారు. 75 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు కష్టపడుతున్నారన్న కిరణ్ కుమార్.. చేతనైనంత సాయం చేసి ఏపీని ఆదుకోవాలని కోరారు. మరోవైపు ఏపీకి ఇప్పటికే పలువురు ప్రముఖులు విరాళాలు అందించారు. రంగాలకు అతీతంగా విరాళాలు అందిస్తున్నారు.