AP Weather Today: ఏపీలో వర్షాలు వస్తాయని చెబుతోంది విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణశాఖ. వేసవిలో అకాల వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని.. ఈ నెల 3న రాయలసీమ, 4న ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయంటున్నారు. మరోవైపు సోమవారం రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగింది. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలోని 6 మండలాలు, విజయనగరం జిల్లా–6, పార్వతీపురం మన్యం జిల్లా–10, అల్లూరి సీతారామరాజు జిల్లా–3, తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు.