Andhra Pradesh Gst Collection March: ఆంధ్రప్రదేశ్‌లో 2025 మార్చి నెలకు రూ. 3,116 కోట్ల జీఎస్టీ వసూలు అయ్యింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 8.35 శాతం మేర అదనంగా జీఎస్టీ ఆదాయం వచ్చింది.2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి 31 తేదీ వరకూ రూ.33,660 కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి రూ.44,825 కోట్ల గ్రాస్ జీఎస్టీ వసూళ్లు వచ్చాయి.