Ap Weather Today:ఏపీపై తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ తుఫాన్ తమిళనాడు వైపు కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ తుఫాన్ భయంతో.. పంట నష్టపోతామని రైతులు ఆందోళనలో ఉన్నారు.