Andhra Pradesh Govt Changed 108 Ambulance Colour: ఏపీలో అంబులెన్స్‌ల రంగులు మారుతున్నాయి. గత ప్రభుత్వం వేసిన నీలం రంగును తొలించి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్త కలర్ వేస్తోంది. ఈ మేరకు ఆ వాహనాలకు తెల్ల, ఎరుపు, పసుపు రంగులతో అంబులెన్స్‌లు మెరవనున్నాయి.. వాటికి రిఫ్లెక్టివ్ టేపులు కూడా ఉంటాయి. ఈ వాహనాల్లో అత్యాధునిక పరికరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ వాహనాలకు కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామికవాడలో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ అంబులెన్స్‌లను వీలైనంత త్వరలో అందుబాటులోకి రానున్నాయి.