ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభలో వెల్లడించారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన నితిన్ గడ్కరీ.. ఏపీలో 18 చోట్ల ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఏయే ఫ్లైఓవర్ ఏ దశలో ఉందనే వివరాలను వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలోగా కొన్ని ఫ్లైఓవర్ నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. మరికొన్నింటికి బిడ్లు ఆహ్వానించాల్సి ఉందని చెప్పారు.