AP Govt Introduced Online LLR Test In Home: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటి దగ్గర నుంచే లెర్నర్స్ లైసెన్స్ పరీక్ష రాసేలా కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఎల్ఎల్ఆర్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ కంప్యూటర్ ద్వారా పరీక్ష రాయొచ్చు. ఈ కొత్త విధానం అందుబాటులోకి రావడంతో.. ఎల్‌ఎల్‌ఆర్ పరీక్షకు రవాణా కార్యాలయాలకు వెళ్లక్కరలేదు. ఒకవేళ ల్యాప్‌టాప్, కంప్యూటర్ లేకపోతే స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాల ద్వారా కూడా పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.