Andhra Pradesh Anganwadi Induction Stoves: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 55 వేల అంగన్‌వాడీ కేంద్రాలకు గ్యాస్ సమస్యను నివారించేందుకు ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్కో అంగన్‌వాడీ సెంటర్‌కు రూ.లక్ష అందిస్తున్నామని, త్వరలోనే తాగునీరు, బాత్రూమ్‌ల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లీ బిడ్డకు పౌష్టికాహారం అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.