Mantralayam New Airport:త్వరలోనే మంత్రాలయం రూపురేఖలు మారుస్తామన్నారు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు. శ్రీమఠం అభిముఖంగా కొలువైన వరసిద్ధి వినాయక మండలి సభ్యులు పీఠాధిపతిని డ్రై ఫ్రూట్స్‌తో తులాభారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో త్వరలోనే మంత్రాలయానికి మినీ యిర్‌పోర్ట్, మంత్రాలయం –కర్నూలు రైల్వేలైన్‌ను తీసుకొస్తామన్నారు. ఇఫ్పటికే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించినట్లు తెలిపారు. దేశ, విదేశాల నుంచి మంత్రాలయం వచ్చే భక్తుల కోసం ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై ఆలోచన చేశామన్నారు.