ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. అనంతపురం జిల్లాకు గుడ్ న్యూస్ వినిపించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో రింగు రోడ్డు నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే ఈ ప్రాంతంలో మరో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. డ్రిప్ ఇరిగేషన్ అందుబాటులోకి తేవడంతో పాటుగా పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. మడకశిర మండలం గుండుమలలో జరిగిన ప్రజావేదిక సభలో మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. అన్ని వ్యవస్థలను వైసీపీ నాశనం చేసిందని మండిపడ్డారు.