తిరుమల శ్రీవారి సేవలో జాన్వీకపూర్, రుక్మిణీ వసంత్

2 hours ago 1
తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి జాన్వీ కపూర్‌ పాల్గొన్నారు. ఆమె వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం జాన్వీ పుట్టినరోజు కావడంతో తన పిన్ని, నటి మహేశ్వరితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ‘కాంతార-చాప్టర్‌ 1’ ఫేమ్‌, నటి రుక్మిణీ వసంత్‌ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. వీరితో ఫోటోలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు.
Read Entire Article