Andhra Pradesh Sc Sub Categorisation: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ వర్గీకరణ ద్వారా 59 ఉప కులాలకు లబ్ధి చేకూరనుంది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 కింద కులాల వారీగా రిజర్వేషన్లు కేటాయించారు. రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని వర్గీకరణ అమలు చేస్తారు. దీనికి సంబంధించిన నివేదికను రాజీవ్ రంజన్ మిశ్ర కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది.