ఏపీలో అమృత్ 2.0 అమలు.. రూ. 10,319 కోట్లకు గ్రీన్ సిగ్నల్

10 months ago 29
పట్టణాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా అమృత్‌ 2.0 పథకం కింద 281 ప్రాజెక్టులను రూ.10,319 కోట్లతో చేపట్టే అంచనాలకు ఆమోదం తెలిపింది. ఈ పనులను కన్సెషనర్‌ హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (ఛామ్)లో పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025-2026 ఎస్‌ఎస్‌ఆర్‌ (Standard Schedule Of Rates) రేట్ల ప్రకారం టెండర్లు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలకశాఖ ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగం ఈఎన్‌సీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Read Entire Article