Andhra Pradesh Govt Contract MTS Employees Retirement Age 62: టీడీపీ ఎమ్మెల్సీలు మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. సర్వీసులో ఉన్న టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహణ.. ఒప్పంద, మినిమం టైం స్కేల్ ఉద్యోగులకు పదవీవిరమణ వయసును 62ఏళ్లకు పెంచడం వంటి అంశాలపై చర్చించారు. అలాగే ఏపీపీఎస్సీ పరీక్షలు రాసే నిరుద్యోగ యువతకు గరిష్ఠ వయోపరిమితి పెంపుపై కూడా ప్రస్తావించారు. ఈ మేరకు మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.