Andhra Pradesh Asha Workers Gratuity: ఆంధ్రప్రదేశ్‌లో ఆశా వర్కర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు.. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆశా వర్కర్ల గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచారు.. వారికి మొదటి 2 ప్రసవాలకు ఇకపై 180 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లించాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం త్వరలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇస్తారని చెబుతున్నారు.