Amaravati Govt Employees 5 Days Work For Week: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. అమరావతి సచివాలయం, అసెంబ్లీ, వివిధ విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఊరట కల్పించింది. ఈ ఉద్యోగులందరికి గతంలో ఇచ్చిన ఓ వెసులుబాటును మరో ఏడాది పాటూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారానికి ఐదు రోజులు పనిచేస్తారు.. రెండు రోజుల పాటూ సెలవు ఉంటుంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.