Andhra Pradesh Farmers Others Category: హక్కుపత్రాలు చూపిస్తే ‘ఇతరులు’ స్థానంలో రైతు పేరు నమోదు చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. దీని కోసం రైతులు కొన్ని డాక్యుమెంట్లను సమర్పించాలని సూచించారు. డాక్యుమెంట్లతో పాటుగా పొరుగున ఉండే రైతుల వాంగ్మూలాలను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఈ మేరకు రైతులు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో దండోరా ద్వారా సమాచారం ఇచ్చామన్నారు.