Visakhapatnam Secunderabad Vande Bharat 4 Additional Coaches: ఏపీలో వందేభారత్ రైలుకు ఫుల్ డిమాండ్ వచ్చింది. ఈ క్రమంలో ఈ రైలుకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 16 కోచ్‌లతో నడుస్తోన్న విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా మరో 4 కోచ్‌లను జత చేశారు. ఈ అదనపు కోచ్‌లు నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి.