Andhra Pradesh Districts Name Change: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పుపై మంత్రుల సబ్ కమిటీ తొలిసారి సమావేశమైంది. జిల్లాల పేర్లు మార్చాలని, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని పలు వినతులు వచ్చాయి. గుర్రం జాషువా పేరు పెట్టాలని, మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నెల 29, 30 తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి సెప్టెంబర్ 15న ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ప్రజల నుండి వినతులను స్వీకరిస్తారు.