విశాఖపట్నం రైల్వే స్టేషన్ రూపుమారుతోంది. కేంద్రం చేపట్టిన పునరాభివృద్ధి ప్రాజెక్టు పనులలో వేగం పెరిగింది. ఈ ప్రాజెక్టు కింద సుమారుగా 500 కోట్ల రూపాయలతో విశాఖ రైల్వే స్టేషన్‌ను ఆధునిక వసతులతో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పనులను ఎంపీ భరత్ బుధవారం పరిశీలించారు. రైల్వే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన ఆయన.. వచ్చే 20 నెలల్లోగా ఈ పనులను పూర్తి చేసి.. విశాఖ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారుస్తామన్నారు.